Search This Blog

Saturday, December 31, 2011

" Youth Assembly "conducting by YUVASATTA and VIDYARTHISATTA in Tirupathi


                                              
లోకసత్తా పార్టీ అనుబంధ విభాగాలు అయినటువంటి యువసత్తా మరియు విద్యార్ధి సత్తా ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీన “ యూత్ అసెంబ్లీ “ అను కార్యక్రమాన్ని తిరుపతి లో నిర్వహించనున్నట్లు,దీనికి యువసత్తా రాష్ట్ర అధ్యక్షుడు పోతూరి శివాజీ రాజు మరియు రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి లు ముఖ్య అతిధి లుగా హాజరు అవుతున్నారు అని విద్యార్ధి సత్తా రాయలసీమ కో – ఆర్డినేటర్ మారం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ కార్యక్రమంలో “ ప్రభుత్వం నుంచి యువత ఏం ఆశిస్తున్నది? --- యువత కోసం ప్రభుత్వం ఏమి చేస్తున్నది? “ అనే అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుందని , ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులుగా నగరంలోని ప్రముఖులు , ప్రముఖ యువజన,విద్యార్ధి మరియు స్వచ్చంద సంస్థల ప్రతినిధులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.అంతేగాక గుర్తించబడిన  మరి కొంత మంది విద్యార్థులు కూడా ఈ చర్చ లో పాల్గొంటారని, ఈ చర్చ లో పాల్గొనదలచిన విద్యార్థులు,స్వచ్చంద సంస్థ ప్రతినిధులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసారు.మరి ఏ ఇతర వివరముల కొరకై 8341231210 మరియు 9014390013 నంబర్ల లో సంప్రదించాలని సూచించారు.
                                                        అభినంధనల తో
                                                        మారం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి   
                                                   (విద్యార్ధి సత్తా రాయలసీమ కో-ఆర్డినేటర్)